చరిత్ర చెప్పడానికి రెడీ అవుతున్న రెండు సినిమాలు

Published on Sun, 06/25/2023 - 04:25

డైనమిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్‌గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్‌ ముఖర్జీ బయోపిక్‌ ‘బాఘా జతిన్‌’, డైనమిక్‌ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్‌గా దేవ్‌ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్‌ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్‌డేట్స్‌ ఈ విధంగా...

అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది
‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్‌ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్‌’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్‌ అధికారి తాజా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్‌ (జతీంద్రనాథ్‌ ముఖర్జీ) బయోపిక్‌గా అరుణ్‌ రాయ్‌ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్‌’. ఈ చిత్రంలో బాఘా జతీన్‌గా నటించి, నిర్మించారు దేవ్‌ అధికారి. 1879 డిసెంబర్‌ 7న జన్మించిన జతీంద్రనాథ్‌ ముఖర్జీ 1915 సెప్టెంబర్‌ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కాగా, జతీంద్రనాథ్‌కి బాఘా జతీన్‌ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్‌ పేరు ‘భాఘా జతీన్‌’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్‌ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో  ‘భాఘా జతీన్‌’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్‌ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి అక్టోబర్‌ 20న ‘భాఘా జతీన్‌’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్‌తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్‌ అధికారి.

భారత్‌ అంటే ఇందిరా...!
‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్‌ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్‌’ అనే డైలాగ్స్‌తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇంకా టీజర్‌లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్‌ 25 తేదీతో టీజర్‌ ఆరంభమవుతుంది.

‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్‌ ఈ టీజర్‌ని షేర్‌ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్‌ ఒదిగిపోయినట్లు ఆమె లుక్‌ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)