Breaking News

బేబి సినిమా నిర్మాతతో గొడవ.. ఆపై క్షమాపణ చెప్పడంతో..

Published on Fri, 08/04/2023 - 14:18

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 'బేబీ'. సాయి రాజేశ్‌ దర్శకుడు.  ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిరోజే రూ.7 కోట్లు వరకు కలెక్షన్స్‌ రాబట్టింది. విడుదలై 20 రోజులు దాటిని ఇప్పటికి కూడా కలెక్షన్స్‌ పరంగా దూసుకుపోతుంది. సుమారు రూ.85 కోట్ల మేరకు ఇప్పటి వరకు రాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొనసాగుతుంది.

(ఇదీ చదవండి: ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్‌)

తాజాగా ఈ సినిమా యూనిట్‌  విజయ యాత్రలో భాగంగా ఏపీలోని భీమవరం పర్యటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. వారితో పాటు కొంతమంది స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా గుంపుగా రావడంతో.. వారు మీడియా ప్రతినిధులు అని గమనించక బౌన్సర్లు తోసేశారు. అంతేకాకుండా వారి పట్ల కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు. దీంతో వారందరూ ఆందోళనకు దిగారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ కారును వారందరూ అడ్డుకున్నారు.

దీంతో కారు నుంచి దిగిన ఎస్కేఎన్‌తో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన కూడా కొంతమేరకు సీరియస్‌ అయ్యారు. అనంతరం వారికి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అక్కడున్న వారిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆస్పత్రికి ఎస్కేన్‌ సిబ్బంది తరలించారట. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)