Breaking News

దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Sat, 07/15/2023 - 16:27

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్‌ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది.

ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్‌ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

(చదవండి:  బేబీ మూవీ రివ్యూ)

ఇక ట్రేడ్ వర్గాల  సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. దీంతో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

బేబీ  ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వివరాలు
► నైజాం -రూ. 2.3 కోట్లు

►సీడెడ్‌- రూ.54.7 లక్షలు

►ఈస్ట్‌: రూ.40.5 లక్షలు

►వెస్ట్‌: 21.6 లక్షలు

►వైజాగ్‌: రూ.80.08లక్షలు

►కృష్ణా: రూ.34.6లక్షలు

►గుంటూరు: రూ.29.3లక్షలు

►నెల్లూరు: రూ.17.83లక్షలు

►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు

►ఓవర్సీస్‌: 1.74 కోట్లు

►మొత్తం : 7.1 కోట్లు

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)