Breaking News

బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్‌ ఇంత తక్కువనా..?

Published on Sat, 07/22/2023 - 07:09

ఆనంద్‌ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ  దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్‌ అశ్విన్‌  కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

(ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ)

ఆమె నటనకు యూత్‌ ఎంతగా కనెక్ట్‌ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్‌ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్‌ అశ్విన్‌ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్‌ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.


సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‌తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్‌. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్‌ చేసింది. కానీ ఇందులో లీడ్‌ రోల్‌ చేసిన ఆనంద్‌ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్‌ గుండెలపై బలంగా తన మార్క్‌ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని టాక్‌.  విరాజ్‌ అశ్విన్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్‌’ మూవీ రివ్యూ)

ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్‌గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్‌ సాయి రాజేష్‌ సినిమా ప్రమోషన్స్‌ టైమ్‌లో చెప్పాడు. దీంతో సినిమా బజ్‌ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్‌గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ సినిమా ఛాన్స్‌ రానున్నదని టాక్‌. 

  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు