Breaking News

నిర్మాత ఎస్‌కేఎన్‌తో ఇబ్బందేమి లేదు : ‘బేబీ’ హీరోయిన్‌

Published on Thu, 03/20/2025 - 13:50

కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్‌లో బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్‌ (SKN) తెలుగమ్మాయిలపై చేసిన కామెంట్స్‌ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని..ఎస్‌కేఎన్‌ అనడం.. ఆ వాఖ్యలు తన చివరి సిసిమా ‘బేబీ’ హీరోయిన్‌ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారంటూ బాగా ట్రోల్‌ చేశారు. ఆ మరుసటి రోజే ఎస్‌కేఎన్‌ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్‌గా మార్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్‌స్టాప్‌ పడింది. తాజాగా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ వివాదంపై స్పందించారు.

ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘జాక్‌’(Jack). సిద్ధు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్‌’ (kiss Song) సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎస్‌కేఎన్‌ కామెంట్స్‌పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది. 

దీనిపై వైష్షవి స్పందిస్తూ.. ‘ఎన్‌కేఎన్‌ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్‌ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో కూడా చేసి పెట్టారు.  నా పేరు మెన్షన్‌ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను’ అని బదులిచ్చింది. అలాగే ఎస్‌కేఎన్‌ బ్యానర్‌లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. ‘బేబీ టీమ్‌తో చేయాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరో చాన్స్‌ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ టీమ్‌తో కలిసి పని చేయడం నాకు మంచి అనుభవం’ అని చెప్పుకొచ్చింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)