Breaking News

బాహుబలి తిరిగొచ్చాడు

Published on Sun, 10/26/2025 - 04:24

‘‘నేను రాజైన తర్వాత నువ్వే నా సేనాధిపతివి’’ అనే డైలాగ్‌తో మొదలైంది  ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా ట్రైలర్‌. ప్రభాస్‌ హీరోగా రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (బాహుబలి: ది బిగినింగ్‌ (2015), బాహుబలి: ది కన్‌క్లూజన్‌ (2017) విడుదలైంది.

బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ టైటిల్‌తో ఈ నెల 31న రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ‘వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో భళ్లాల దేవుడికి మహారాజా పట్టాభిషేకం’, ‘మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి... అదే నా కోరిక’, ‘దేవసేన నీది... నేను మాటిస్తున్నాను...’, ‘నేను నీవాణ్ణి దేవసేన...’, ‘మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు...’, ‘ఏది మరణం... మన గుండె ధైర్యంకన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం... ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను...’, ‘బాహుబలి తిరిగొచ్చాడు’ అనే డైలాగ్స్‌ ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)