Breaking News

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అయలాన్‌’?

Published on Tue, 01/23/2024 - 11:14

తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్‌ వరుణ్‌, డాన్‌, ప్రిన్స్‌ చిత్రాలు తెలుగులో విడుదలైన మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇటీవలే ‘అయ‌లాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయ‌లాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న తెలుగులో విడుదల కాబోతుంది. 

(చదవండి: అయోధ్యకు జూ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా?)

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ స‌న్ నెక్స్ట్  త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుందట. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. త‌మిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)