Breaking News

ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు సార్లు చూశానన్న ‘అవతార్‌’ డైరెక్టర్‌, జక్కన్నపై ప్రశంసలు

Published on Mon, 01/16/2023 - 10:37

అంతర్జాతీయ వేదికలపై ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన ఈ చిత్రం రీసెంట్‌గా లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ అనే మరో అవార్డును గెలుచుకుంది. ఇలా ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్‌ చేస్తున్న ఈ మూవీపై హాలీవుడ్‌ దిగ్గజం, అవతార్‌ మూవీ డైరెక్టర్‌ జెమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు కురిపించారు.

చదవండి: తండ్రి అయిన స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

అయితే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నేపథ్యంలో డైరెక్టర్‌ రాజమౌళి, ఎమ్‌ఎమ్‌ కీరవాణిలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగినో ఓ అవార్డు ఫంక్షన్‌లో రాజమౌళి, జెమ్స్‌ కామెరూన్‌ కలిశారు. ఈ సందర్భంగా కామెరూన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రెండు సార్లు చూశానని తనతో చెప్పారంటూ రాజమౌళి మురిసిపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ది గ్రేట్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూశారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది.

చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా!

అంతేకాదు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూడమని తన భార్య సుజిక్‌ జేమ్స్‌కి కూడా ఆయన ప్రతిపాదించారు. దీంతో ఆమెతో కలిసి ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని మరోసారి చూశారట. ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి పది నిమిషాల పాటు నాతో విశ్లేషించడం నమ్మలేకపోతున్నా. అదే విధంగా ‘మీరు ప్రపంచంలోనే టాప్‌ డైరెక్టర్‌’ అని ఆయన నాకు కితాబు ఇవ్వడం చాలా ఆనందగా ఉంది. మీకు ధన్యవాదాలు సార్‌’ అంటూ జక్కన్న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)