Breaking News

నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను: అవసరాల శ్రీనివాస్‌

Published on Thu, 12/14/2023 - 08:20

‘‘దర్శకత్వం, నటనల కంటే నాకు రైటింగ్‌ అంటే ఎక్కువ ఇష్టం. నేను ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీసినప్పుడు ఆ తరహా చిత్రాలు అప్పుడు రాలేదు. అలానే ‘జో అచ్యుతానంద’ కూడా. ఇలా నా కథలతో నాతో నేనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్‌. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్‌ ఫిల్మ్‌ ‘పిండం’లో అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషించారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వంలో యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘సాయికిరణ్‌  చేసిన ‘స్మోక్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి, తనలో రచన, దర్శకత్వ ప్రతిభ ఉందని గ్రహించాను. తను చెప్పిన ‘పిండం’ కథ నచ్చింది. ఈ సినిమాలో అతీంద్రియ శక్తులపై పరిశోధనలు చేసే లోక్‌నాథ్‌ పాత్ర చేశాను. ‘ప్రేమకథా చిత్రమ్‌’ చూసినప్పుడు కొంచెం భయపెడితే ప్రేక్షకులు సినిమాను శ్రద్ధగా చూస్తారని అర్థమైంది. కానీ కథలో హారర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండాలి. అప్పుడే కనెక్ట్‌ అవుతారు.

ఇక ప్రస్తుతం ‘ఈగల్‌’, ‘కిస్మత్‌’, ‘కన్యాశుల్కం’ సినిమాల్లో నటిస్తున్నాను. రైటర్‌గా, దర్శకుడిగా ఓ మర్డర్‌ మిస్టరీ సినిమా స్క్రిప్ట్‌ రాస్తున్నాను. నా తర్వాతి చిత్రం ఇదే కావొచ్చు. అలాగే ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)