Breaking News

మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్

Published on Mon, 01/23/2023 - 21:20

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.  ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ వేదికగా అతియాశెట్టిని వివాహమాడారు. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ప్రేమజంటకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.  ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

నూతన వధూవరులు అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ  వేడుకలో సునీల్ శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా మిఠాయిలు పంచుతూ కనిపించారు. ఈ జంట తొలిసారి భార్యాభర్తలుగా చాలా అందంగా కనిపించింది.

అతియా తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు. సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది.  మీ కృతజ్ఞతలు, ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.' పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ, క్రిెకెట్ ప్రముఖులు విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, ఆలియా భట్, కృతి సనన్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి ఫడ్నేకర్, నవ్యనందా శుభాకాంక్షలు తెలిపారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)