Breaking News

క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

Published on Tue, 01/21/2025 - 19:24

తెలంగాణ మహిళా కమిషన్‌కి జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభితలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు.

అసలేం జరిగిందంటే?
సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్‌ అయిన వేణుస్వామి(Venu Swamy).. అక్కినేని హీరో నాగచైతన్య-శోభితల వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ..వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. వారిద్దరు విడిపోతారంటూ జోస్యం చెప్పడంపై  అక్కినేని అభిమానులతో పాటు మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి.

 వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమెన్ కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ఉమెన్‌ కమిషన్‌ వేణు స్వామికి నోటీసులు పంపించి వివరణ కోరింది. మహిళా కమిషన్‌ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా కమిషన్‌ ముందే హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ మహిళా కమిషన్‌ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. 

బహిరంగ క్షమాపణలు
మహిళా కమిషన్‌ మరోసారి నోటీసులు జారీ చేయడంతో వేణుస్వామి తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.అంతేకాదు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు ఓ లేఖను అందజేశాడు. వేణు స్వామి క్షమాపణలు స్వీకరించిన మహిళా కమిషన్‌.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం  కావొద్దని హెచ్చరించింది. 

సమంత విషయంలోనూ..
సెలబ్రేటీల పర్సనల్‌ విషయాలపై జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి ఫేమస్‌ అయ్యాడు. గతంలో సమంత విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నాగచైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పాడు. సమంత, చైతు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి మరింత ఫేమస్‌ అయ్యాడు. అయితే ఆ తర్వాత తరచూ సినీ ప్రముఖులపై జోతిష్యం చెప్పడంతో వేణుస్వామిపై విమర్శలు వచ్చాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)