Breaking News

కొత్తగా ట్రై చేశాను : హీరో అశ్విన్ బాబు

Published on Wed, 07/31/2024 - 18:22

‘హిడింబ తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా ట్రై చేయాలని, యూనిక్ పాయింట్‌తో రావాలని అనుకున్నాను. ఆ టైంలోనే ఈ శివం భజే కథను విన్నాను. నాకు చాలా నచ్చింది. రాజు గారి గది, హిడింబలా ఇందులోనూ కొత్త పాయింట్ ఉంటుంది. అది ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు హీరో అశ్విన్‌ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వంలో  వహించిన ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అశ్విన్‌ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

⇒ శివంభజే చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డివైన్ పాయింట్ ఉంటుంది. హిడింబలో కారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.. అంతా విధి.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే టైపులో ఉండే పాత్ర. అలాంటి పాత్ర చుట్టూ రాసుకున్న కథ నాకు చాలా నచ్చింది. ముస్లిం వ్యక్తి అయినా కూడా అప్సర్ ఈ కథను రాసిన విధానం నాకు చాలా నచ్చింది.

⇒ శివం భజేలో చాలా మెచ్యూర్డ్‌గా, స్టైలీష్ యాక్షన్ చేశావ్ అన్నా అని మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అన్నారు. అది నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్. టీం అంతా కూడా యాక్షన్ సీక్వెన్స్ పట్ల సంతృప్తి చెందారు. డైరెక్టర్‌ ఈ కథలో డివైన్ పాయింట్‌‌ను ఎలా కనెక్ట్ చేశారన్నదే ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

⇒ హిడింబకు సెన్సార్ సమస్యలు వచ్చాయి. కానీ ఈ చిత్రాన్ని చూసి వారంతా సంతోషించారు. సినిమా చాలా బాగా వచ్చిందని అన్నారు. అప్సర్ తీసిన పాయింట్, ఐడియాలజీ చాలా నచ్చింది.

⇒ వికాస్ బడిస మ్యూజిక్, అప్సర్ రాసిన కథ, శివేంద్ర విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శివయ్య మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యంగా ముందడుగు వేశారు.

⇒ నా బర్త్ డే, నిర్మాత పుట్టిన రోజు ఆగస్ట్ 1న కాబట్టి సినిమాను ఆ డేట్‌ను రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఒక డేట్ అనుకున్నాం. ఆ డేట్ మా బర్త్ డే అయింది. అంతే కానీ.. కావాలని ప్లాన్ చేసింది అయితే కాదు.

⇒ దిగంగనా అద్భుతంగా నటించారు. అర్బాజ్ ఖాన్ గారితో మంచి సీన్స్ ఉంటాయి. ఆయన పాత్రతోనే సినిమా అంతా నడుస్తుంది. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది.

⇒ నేను ఒక మంచి డ్యాన్సర్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంత వరకు తెరపై అంతగా డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. సినిమా కథకు సరిపోతేనే డ్యాన్స్ పెట్టమని అంటాను. కథలో భాగంగానే అన్నీ రావాలని ఫీల్ అవుతాను. థియేటర్లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాను.

⇒ మా నిర్మాత చాలా మంచి వ్యక్తి. ప్రతీ సారి నేను ఆయన్ను బడ్జెట్ విషయంలో కంట్రోల్ చేస్తుండేవాడ్ని. కానీ ఆయన సినిమాకు ఏం కావాలో అంత కంటే ఎక్కువే పెట్టారు. ఏమైనా అంటే శివయ్య ఉన్నారని అంటుండేవారు. ఆయన ఎలా అనుకున్నారో సినిమా అలా వచ్చింది.

⇒ అందరూ రాజు గారి గది ఫ్రాంచైజీల గురించి అడుగుతున్నారు. కానీ నాకు ఎక్కువగా థ్రిల్లింగ్ సబ్జెక్టులే వస్తున్నాయి. రాజు గారి గది 4 ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అన్నయ్య కథను రాస్తున్నారు. మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)