Breaking News

అమెరికా, ఇండియా ఏదైనా సరే ఈ సమస్య 'వింటారా సరదాగా' (టీజర్‌)

Published on Sat, 07/12/2025 - 11:40

అశోక్‌ గల్లా హీరోగా నటించిన మూడో సినిమా 'వింటారా సరదాగా' (Vintara Saradaga) నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. ఇప్పటికే ఆయన దేవకీనందన వాసుదేవ, హీరో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు కడుపుబ్బా నవ్వించేందుకు మళ్లీ వస్తున్నాడు. అశోక్‌ గల్లా హీరోగా, రాహుల్‌ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా నటించిన 'వింటారా సరదాగా' చిత్రం రొమాంటిక్‌ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్‌ తెరకెక్కించనున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరించనుంది.

విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా సినిమా టీజర్‌ ఉంది. ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా' అని చెప్పవచ్చు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)