Breaking News

లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?

Published on Tue, 07/11/2023 - 12:22

ప్రముఖ సీనియర్ నటుడు ఆశిష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో విలన్‌ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో  పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్‌  ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలి బరువాను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.  కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

(ఇది చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్‌ ఏం చెప్పారంటే

అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట  సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు.

(ఇది చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్‌) 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)