Breaking News

అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి

Published on Thu, 06/22/2023 - 12:27

ఏ సినిమాలో అయినా స్క్రీన్ పై కనిపించేవాళ్లు కేవలం నటులు. కానీ మనమేమో హీరోలని అభిమానిస్తాం, హీరోయిన్లని ప్రేమిస్తాం, విలన్స్‌ని ద్వేషిస్తాం. చెప్పాలంటే విలన్ పాత్రని క్రూరంగా చూపిస్తే మనమే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సదరు విలన్ యాక్టర్స్ నిజ జీవితంలో అలా ఉండరు! కానీ ఆ పాత్రల తాలుకూ ప్రభావం మాత్రం వాళ్లపై గట్టిగానే పడుతుంది.

తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ వస్తూనే ఉంటారు. కానీ చాలామందికి ఆశిష్ విద్యార్థి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో 'పద్మావతి హ‍్యాపీయేనా?' అనే డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఈ నటుడే గుర్తొస్తాడు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ విలన్ పాత్రలు చేసిన ఇతడు.. ఆ తర్వాత కామెడీ విలన్ రోల్స్ కి షిప్ట్ అయ్యాడు. ఏదేమైనా వీటి వల్ల తను చాలా ఇబ్బంది పడ‍్డానని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)

'సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చేసిన అలాంటి పాత్రల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్స్ తమ యాక్టింగ్ గురించి గొప‍్పగా చెప్పుకోలేరు! కదా? వాటి ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ కామెంట్స్.. అన్నీ!' అని నటుడు ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టాలో దీనితోపాటు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.

ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం చూసుకుంటే.. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మరోవైపు ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2001లో రాజోషి బరువాని పెళ్లి చేసుకున్న ఇతడు.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ మధ్యే రూపాలీ బరువా అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 


(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు