Breaking News

'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

Published on Sat, 04/19/2025 - 11:53

‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్‌ ప్రకటించారు. విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మూవీని తెరకెక్కించాడు.  అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌  నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చని అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు.

బింబిసార సినిమా తర్వాత కల్యాణ్‌రామ్‌ మరో రెండు చిత్రాలు చేశారు. కానీ, వాటికి పెద్దగా రెస్పాన్స్‌ దక్కలేదు. అయితే, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి చిత్రానికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటీవ్‌ టాక్‌ వినిపిస్తుంది. దీంతో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్లు రాబట్టింది. బింబిసార ఫస్ట్‌ డే నాడు రూ. 6.3 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఏ రెండు సినిమాలు కూడా మొదటిరోజు రూ. 5 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. అయితే, అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఇప్పుడు రూ. 5.15 కోట్లు రాబట్టి ఆ లోటును భర్తి చేసింది.

ఈ సినిమాకు ప్రధాన బలయం విజయశాంతి, కల్యాణ్‌ రామ్‌ అని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్మురేపారు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ల మధ్య వచ్చే సీన్‌ అందరినీ   కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్‌ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్‌ బలం ఎమోషన్‌.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్‌ బాగా హిట్‌ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను  'అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి ' కట్టిపడేస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)