యంగ్‌ హీరోయిన్‌ ప్రేమలో 'అర్జున్‌ దాస్‌' !

Published on Sun, 08/24/2025 - 17:23

కోలీవుడ్‌ నటుడు అర్జున్‌ దాస్‌ ప్రేమలో పడ్డాడు. ఈమేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఖైదీ సినిమాలో విలన్‌గా నటించిన అర్జున్‌ దాస్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఓజీ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఒక యంగ్‌ హీరోయిన్‌తో అర్జున్‌ దాస్‌ ప్రేమలో ఉన్నారని నెట్టింట వైరల్‌ అవుతుంది.

2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్‌ దాస్‌.. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు.  అయితే, యంగ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)తో  ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేస్తుండగా ఈ  ప్రచారం జరుగుతుంది. కానీ, అర్జున్‌ దాస్‌ ఖండించారు. ఆపై ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. 

కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూనే వారి ప్రేమ నిజమేనంటూ చెప్పుకొస్తున్నారు. సరైన సమయం చూసి ప్రేమ గురించి అందరికీ తెలుపుతారంటూ పేర్కొంటున్నారు.   బ్యాంకు ఉద్యోగిగా, రేడియో జాకీగా అర్జున్‌ దాస్‌ పనిచేయగా.. ఐశ్వర్య లక్ష్మి  వైద్య విద్య పూర్తి చేశారు. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సత్యదేవ్‌తో గాడ్సే మూవీలో నటించారు. ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు'లో  సాయిధరమ్‌ తేజ్‌తో నటిస్తున్నారు. మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్,థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో ఆమె మెప్పించారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు.
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)