Breaking News

ఎ.ఆర్. రెహమాన్ కచేరీ.. బాధితుడికి రూ. 55వేలు పరిహారం

Published on Tue, 06/10/2025 - 11:25

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన సంగీత కచేరీ కోసం రూ. 10వేలు చెల్లించి ఒక అభిమాని టికెట్‌ కొన్నాడు. అయితే భారీ వర్షం కారణంగా ఆ షో రద్దు కావడంతో అతను కలత చెందాడు. దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ బాధితుడు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. అయితే, రెండేళ్ల విచారణ తర్వాత బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది

2023 ఆగస్టు 12న చెన్నైలో మ్యూజికల్ కన్సర్ట్‌కు హాజరు కానున్నానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్‌ చేశారు. దానిని చూసిన అభిమానులు భారీగా టికెట్లు కొన్నారు. అయితే, ఆ రోజు భారీ వర్షం పడటంతో షో రద్దు అయింది. తరువాత, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10న జరిగింది. ఆగస్టులో కొనుగోలు చేసిన టిక్కెట్లతో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే, చెన్నైలోని అన్నా నగర్‌కు చెందిన అర్జున్, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రూ. 10 వేల  టికెట్ కొనుగోలు చేశాడు. సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమం జరిగినప్పుడు నిర్వాహకులు సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిపించడంతో   తాను  తీవ్ర మనస్తాపానికి గురైనట్లు అర్జున్‌ పేర్కొన్నారు. దీంతో చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

అందులో, అతను ఇలా పేర్కొన్నాడు, "సంగీత దర్శకులు A.R. రెహమాన్‌  మ్యూజికల్‌ కార్యక్రమం కోసం రూ.10 వేల  టికెట్ కొన్నప్పటికీ,  కచేరీని చూడలేకపోయిను. అందుకు నేను చాలా బాధపడ్డాను. కాబట్టి నేను అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలి. టికెట్ రుసుమును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. అర్జున్‌ చేసిన ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. త ఎ.ఆర్. రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించిన ACTCని పరిహారంగా రూ. 50,000 చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ అర్జున్‌కు రెండు నెలల్లోగా మొత్తం రూ.55,000 చెల్లించాలని, అందులో రూ.5,000 వ్యాజ్య ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు