Breaking News

ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య

Published on Thu, 02/20/2025 - 20:02

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్‌ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. సైరా భానును పెళ్లాడిన ఆయన గతేడాది తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు 29 సంవత్సరాల వివాహబంధం తర్వాత డివోర్స్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తాము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో దయచేసి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వీరిపై కొన్ని ఊహగానాలు రావడంతో సైరా బాను తన భర్త రెహమాన్ చాలా మంచివాడంటూ ఓ నోట్‌ను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రూమర్స్‌కు చెక్ పడింది.

అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సైరా భాను తరఫున ప్రతినిధులు  ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటనలో.. 'కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కఠినమైన సమయంలో త్వరగా కోలుకోవడంపైనే ఆమె దృష్టి ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగొస్తా.' అని రాసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు లాస్ ఏంజిల్స్‌లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్‌లకు  హృదయపూర్వక కృతజ్ఞతలు. 'అంటూ నోట్ విడుదల చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)