Breaking News

తనయుడితో ఏఆర్‌ రెహమాన్‌ స్టెప్స్‌!

Published on Thu, 02/23/2023 - 09:13

తమిళసినిమా: నటులు తమ వారసులతో కలిసి ఆడి పాడటం కొత్తేమీ కాదు. అయితే ఓ దిగ్గజ సంగీత దర్శకుడు తన వారసుడితో కలిసి స్టెప్స్‌ వేయడమే విశేషం. ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మమన్‌ తన తనయుడితో కలిసి ఒక ప్రమోషన్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేయడం ఇంకా విశేషం. ఈయన గతంలో విజయ్‌ హీరోగా నటించిన బిగిల్‌ చిత్రం ప్రమోషన్‌ కోసం సింగ పెన్నే అనే పాటలో నటించడంతో పాటు పలు ప్రైవేట్‌ ఆల్బంలలో నటించిన విషయం తెలిసిందే.

అంతే కాదు సంగీత దర్శకుడు, గీత రచయిత అయిన ఈయన నిర్మాత కూడా. అంతేకాదు త్వరలో దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈయన వారసుడు అమీన్‌ కూడా ఇప్పుడు సంగీత దర్శకుడిగా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆల్బంలకు సంగీతాన్ని అందిస్తున్న అమీన్‌ త్వరలోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే  సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న ఏఆర్‌.రెహ్మమన్‌ ప్రస్తుతం తన తనయుడు అమీన్‌తో కలిసి ఒక ప్రమోషన్‌ సాంగ్‌లో నటించనున్నాడట.

ఇందులో తనయుడితో కలిసి స్టెప్స్‌ వేసే పనిలో ఉన్నారని టాక్‌. నటుడు శింబు, గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటిస్తున్న చిత్రం పత్తు తల. చిల్లన్ను ఒరు కాదల్‌ చిత్రం ఫేమ్‌ కృష్ణ చాలా గ్యాప్‌ తరువాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీ విడుదలకు ముస్తాబవుతున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్‌.రెహ్మమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్‌ సాంగ్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఏఆర్‌.రెహ్మమన్‌తో కలిసి ఆయన తనయుడు అమీన్‌ నటిస్తున్నారు. ఈ ప్రమోషన్‌ సాంగ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)