Breaking News

అందుకే దర్బార్‌ ఫ్లాప్‌ అయింది: ఏఆర్‌ మురుగదాస్‌

Published on Wed, 04/05/2023 - 09:29

కోలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఏఆర్‌ మురుగదాస్‌ ఒకరు. అజిత్‌ కథానాయకుడిగా దీనా చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన వరుసగా పలు చిత్రాలతో విజయపథంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఏఆర్‌ మురుగదాస్‌ను ఒకసారిగా డౌన్‌ ఫాల్‌ చేసిన చిత్రం దర్బార్‌. ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్‌. భారీ అంచనాల మధ్య విడుదలైన దర్బార్‌ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మూడేళ్లుగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ మెగా ఫోన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దర్బార్‌ దెబ్బతో తదుపరి విజయ్‌ హీరోగా చేయాల్సిన చిత్రం వెనక్కి వెళ్లిపోయింది.

కాగా ఇటీవల ఓ భేటీలో రజనీకాంత్‌ తో చేసిన దర్బార్‌ చిత్రం ఫ్లాప్‌ కావడానికి కారణాన్ని సుమారు మూడేళ్ల తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ బయటపెట్టారు. రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం తనకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనీ, జూన్‌ నెల ముంబాయిలో వర్షాల సీజన్‌ కావడంతో అలా చిత్ర షూటింగును హడావుడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎందుకంటే ఆగస్టులో రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారన్నారు. తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని. దీంతో ఆయనతో చిత్రాలు చేసే అవకాశాన్ని ఏ కారణంగాను వదులుకోకూడదని భావించానన్నారు.

రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవడంతో ఆ సమయంలో దర్బారే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జరిగిందన్నారు. దీంతో ఫిబ్రవరిలో రజనీకాంత్‌ చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశం రావడం మార్చి నెలలో షూటింగ్‌ ప్రారంభించి జూన్‌ నెలకంతా చిత్రాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఎలాగైనా రజనీకాంత్‌ చిత్రం చేసి హిట్‌ కొట్టాలని భావించానని, అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో దర్బార్‌ చిత్రం ఫ్లాప్‌ అయ్యిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్‌కు ముందు ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు చాలా సమయం అవసరం అవుతుందన్నారు. అది దర్బార్‌ చిత్రానికి లేకపోయిందని మురుగదాస్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)