Breaking News

'సికందర్' ప్లాప్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మురుగదాస్‌

Published on Sun, 08/17/2025 - 11:43

మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన "సికందర్" చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అభిమానులు కూడా ఈ చిత్రంపై విమర్శలు చేశారు. సికందర్‌ స్క్రిప్ట్ విషయంలో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా వైఫల్యానికి కారణం తాను కాదంటూ మురుగదాస్‌ తాజాగా చెప్పుకొచ్చారు. సుమారు సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 170 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు బాలీవుడ్‌ పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. సాజిద్ నదియాద్వాలా ఈ మూవీని నిర్మించారు.

సికందర్ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సల్మాన్‌ ఖాన్‌ అనే అర్థం వచ్చేలా మురుగదాస్‌ చెప్పుకొచ్చాడు. 'ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నేను బాగా తెరకెక్కించలేకపోయాను. కానీ, దానికి నేను మాత్రమే బాధ్యత వహించను. గజిని రీమేక్ అయినప్పటికీ బాగా ఆడింది. సికందర్‌ స్ట్రెయిట్ సినిమా.. అక్కడ నాకు కమాండింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేశారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాను. కాబట్టి సికందర్‌ వైఫల్యానికి నేను బాధ్యత వహించను.' అని ఆయన పేర్కొన్నారు.

టాలీవుడ్‌పై పరోక్ష వ్యాఖ్యలు
ఇదే ఇంటర్వ్యూలో మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలామంది దర్శకులు రూ. 1000 కోట్ల సినిమాలు తీస్తున్నారు. వాళ్లు తీసే సినిమాలు కేవలం జనాలకు కనువిందు చేసేలా ఉంటాయి. కానీ, తమిళ దర్శకులు తీసే సినిమాలు ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటాయి. మేము సామాజిక కోణంలో సినిమాలు చేస్తాం. ప్రజలను ఆలోచింపచేసే సినిమాలు చేస్తాం.' అంటూ ఆయన కామెంట్లు చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)