Breaking News

లిప్‌లాక్‌కు రెడీ!

Published on Mon, 07/15/2024 - 12:42

ఈతరం కథానాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో ఉన్నారు. అవకాశాలు వచ్చేవరకు వాటి కోసం తంటాలు పడుతున్నారు. అవకాశాలు వస్తుంటే పారితోషకాలు పెంచే ఆలోచనలో ఉంటున్నారు. పైకి మాత్రం పాత్రలు నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎలాంటిదైనా వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. చాలామంది హీరోయిన్లది ఇదే తంతు. 

అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఇందుకు అతీతం కాదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మలయాళ చిత్రం ప్రేమమ్‌ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా పరిచయమైన నటి బ్యూటీ. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీగా మారారు. అయితే ఆరంభంలో మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ తెచ్చుకున్నారు. అలా తెలుగులో కార్తికేయ 2 చిత్రం వరకు అనుపమ పరమేశ్వరన్‌ తన పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో అందాల ఆరిబోతకు గేట్లు ఎత్తేశారు. అలా ఇటీవల ఈమె టిల్లు స్క్వేర్‌ చిత్రంలో అందాలారబోతలో విజృంభించేశారు. 

ఇక లిప్‌లాక్‌ సన్నివేశాల్లోనూ రక్తి కట్టించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిర్మాతకు అనుపమ పరమేశ్వరన్‌ గట్టిగానే షాక్‌ ఇచ్చారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఒక చిత్రంలో కథానాయకగా నటించడానికి నిర్మాత అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదించగా, కనీసం కథ కూడా వినకుండా. పాత్ర ఎలాంటిదైనా సరే పారితోషికం మాత్రం కోటి కావాలంటూ డిమాండ్‌ చేశారట. దీంతో నిర్మాత అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. అనుపమాకు తెలుగులో హిట్‌ చిత్రాలు ఉన్నాయి, కానీ తమిళనాడు మాత్రం ఇంకా మంచి సక్సెస్‌ కోసం పోరాడుతున్న నటినే. అలాంటి నటి కోటి పారితోషికం డిమాండ్‌ చేస్తే ఏ నిర్మాత అయినా చేసే పని ఇదే అంటూ సోషల్‌ మీడియాలో న్యూస్‌ చక్కర్లు కొడుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)