Breaking News

స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ.. కారణం ఇదే

Published on Mon, 02/05/2024 - 08:19

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'ఈగల్‌'.    సూర్య వర్సెస్ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో  అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిత్ర దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనికి హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ రాఖీ కట్టింది. ఈ వేడుకలో స్టేజీపైకి వచ్చిన అనుపమ డైరెక్టర్‌ను అన్నయ్య అని పిలిచింది. వెంటనే రవితేజ..  'నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో' అని చెప్తాడు. 

ఆ వెంటనే అనుమప కూడా సారీ రవిగారు.. 'దర్శకుడు కార్తీక్‌తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి ఆయన్ను అన్నయ్య అనే నేను పిలుస్తున్నాను అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్చుకోలేను.' అని చెప్పింది. ఇంకేముంది ఈ లోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అన్నయ్యకు కట్టేయమని చెప్పింది. దీంతో  స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్‌కి అనుమప రాఖీ కడుతుంది.

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. గతంలో డైరెక్టర్‌ కార్తీక్‌ చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. ప్రేమమ్,కృష్ణార్జున యుద్ధం,చిత్రలహరి,నిన్ను కోరి,కార్తీకేయ,ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా వర్క్‌ చేశాడు. దీంతో అనుపమతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)