Breaking News

ముద్దు సీన్‌లో నటిస్తే తప్పేంటి?: అనుపమ

Published on Sun, 04/07/2024 - 07:09

తమిళసినిమా: పక్కింటి అమ్మాయిగా ఇమేజ్‌ తెచ్చుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. అలాంటిది ఇప్పుడీ మలయాళీ భామ కూడా గ్లామర్‌కు గేట్లు ఎత్తేశారు. ప్రేమమ్‌ చిత్రంతో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా పరిచయం అయిన ఈమె తమిళంలోనూ కొడి, తల్లిపోగాదే, సైరన్‌ వింటి చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో కథానాయకిగా పలు హిట్‌ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఇటీవల టిల్లు స్క్వేర్‌ అనే తెలుగు చిత్రంలో లిప్‌లాక్‌, అందాలారబోత అంటూ విజృంభించారు. దీంతో నటి అనుపమ పరమేశ్వరన్‌నే ఇలా నటించింది? అని చాలా మంది ఆశ్చరపడుతున్నారు. కొందరైతే అంతా బాగా ఉందిగా సడన్‌గా ఈ అమ్మడికి ఏమొచ్చిందీ? అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద అ కేరళ కుట్టి ఇప్పుడు వార్తలో నానుతున్నారు.

గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరి ఈమె నటించిన టిల్లు స్క్వేర్‌ చిత్రం హిట్‌ అయ్యింది. అందాలారబోత అనే విషయాన్ని పక్కన పెడితే అనుపమ పరమేశ్వరన్‌కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. గ్లామర్‌గా నటించడంపై వస్తున్న విమర్శనలపై అనుపమ ఘాటుగానే స్పందించారు. ఈమె ఒక భేటీలో పేర్కొంటూ తాను లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారనీ, తాను ముద్దు సన్నివేశాల్లో నటించననీ, గ్లామరస్‌గా నటించనని చెప్పింది తన 18 ఏళ్ల వయసులోనని అన్నారు.

అయితే నటిగా తానిప్పుడు చాలా పరిణితి చెందానన్నారు. కథకు అవసరం అయితే లిప్‌లాక్‌ వంటి సన్నివేశాల్లో నటించడం తప్పేకాదని అన్నారు. అంతే కాకుండా ఒకేరకమైన మూస పాత్రల్లో నటించి బోర్‌ కొడుతోందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే టిల్లు స్క్వేర్‌ చిత్రం చూసిన తరువాత ప్రశంసించడమో, విమర్శించడమో చేయవచ్చు గానీ, చిత్రం చూడకుండానే విమర్శించడం కరెక్ట్‌ కాదని నటి అనుపమ పరమేశ్వరన్‌ ఫైర్‌ అయ్యారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)