Breaking News

పరదా చేసినందుకు గర్వపడుతున్నా: అనుపమా పరమేశ్వరన్‌

Published on Tue, 08/26/2025 - 00:08

‘‘తెలుగులో ‘పరదా’ లాంటి కథని నమ్మి, నిర్మించిన విజయ్‌గారికి ధన్యవాదాలు. నా కెరీర్‌లో మోస్ట్‌ ఫేవరెట్‌ ఫిలిం ఇది. కెరీర్‌లో ఉత్తమ నటన ఇచ్చానని రివ్యూస్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ‘పరదా’ లాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని అనుపమా పరమేశ్వరన్‌ తెలిపారు.

ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’. భాగ్యలక్ష్మి  పోస సమర్పణలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువతో కలిసి విజయ్‌ డొంకాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ–‘‘ప్రవీణ్‌గారు చాలా నిజాయతీగా ఈ సినిమా తీశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా బాగుంది.

ఈ సినిమా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. ‘‘మా చిత్రానికి జాతీయ స్థాయిలో చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రంలో నటనకుగానూ అనుపమకి  తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని నమ్మకంగా ఉన్నాను’’ అని తెలిపారు. ‘‘పరదా’ చాలా మంది అమ్మాయిల జీవితాన్ని గుర్తు చేసిందని ఒక పెద్దావిడ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చేసినందుకు ఒక నిర్మాతగా చాలా గర్వపడుతున్నాను’’ అన్నారు విజయ్‌ డొంకాడ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)