Breaking News

యాక్షన్‌ మూవీ 'కటాలన్‌' టీజర్‌ రిలీజ్‌

Published on Fri, 01/16/2026 - 21:46

మలయాళ నటుడు ఆంటోని వర్గీస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కటాలన్‌. దుషారా విజయన్ కథానాయిక. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, సెకండ్‌ లుక్‌లో.. మలయాళ మూవీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 16న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. 

ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అజనీష్‌ సంగీతం అందించిన ఈ మూవీలో సునీల్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, రాజ్‌ తిరందాసు, పార్థ్‌ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటింనున్నారు. కటాలన్‌ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మే 14న విడుదల కానుంది.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)