బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు
Breaking News
AI Video: అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు
Published on Sat, 01/13/2024 - 13:53
ప్రస్తుతం టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరికొత్త సాంకేతికతను అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) మరో మెట్టు ఎక్కించింది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది. సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024
తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్ పోస్ట్ చేశారు. ఇటీవల ఆర్జీవీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అందగాడు అనే పేరు సొంతం చేసుకున్న నటుడు శోభన్ బాబుకు సంబంధిచిన రీక్రియేటెడ్ వీడియోను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే!
Tags : 1