Breaking News

పొంగల్‌కు పెరుగుతోన్న పోటీ.. రేసులో శ్రీలీల చిత్రం!

Published on Fri, 09/12/2025 - 18:53

టాలీవుడ్‌ సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అంతేకాదు ఈ పండుగకు రిలీజ్‌కు పెద్దఎత్తున పోటీ ఉంటుంది. దాదాపు ఏడాది ముందు నుంచే ప్లాన్‌ చేస్తారు మేకర్స్. సినీ ఇండస్ట్రీలో అంతలా డిమాండ్‌ ఉన్న ఫెస్టివల్‌ ఇదొక్కటే. ఇప్పటికే టాలీవుడ్‌ నుంచి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, మెగాస్టార్‌ చిరంజీవి మనశివశంకర వరప్రసాద్‌ గారు చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైతం పొంగల్‌ పోటీకి సై అంటున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జన నాయగన్‌ సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇంతలా పోటీ ఉన్న పొంగల్‌కు మరో చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే మదరాసితో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ మూవీ పరాశక్తి సైతం సంక్రాంతి పోటీకి సై అంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ రెడ్ జైయింట్ మూవీస్‌ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలకు సైతం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉండడంతో  మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

కాగా.. శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాలో శివ కార్తికేయన్ విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది.  

 

Videos

విజయవాడ-గుంటూరు మధ్య పెడితే... YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)