Breaking News

దర్శన్‌కు ఉరిశిక్ష వేయాలంటూ కోర్టులో అలజడి

Published on Thu, 09/04/2025 - 13:53

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ (Actor Darshan) బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఆయన మళ్లీ జైలుకెళ్లారు. ఈ కేసులో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ   బెంగుళూరులోని ‘పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, తనను బళ్లారి జైలుకు తరలించాలని కోరుతూ బెంగళూరు కోర్టులో దర్శన్‌ ఒక పిటిషన్‌ పెట్టుకున్నారు. విచారణ సమయంలో కోర్టు హాలులోకి గుర్తుతెలియని వ్యక్తి ఎంట్రీ ఇచ్చి అలజడి సృష్టించాడు.

దర్శన్‌ పిటిషన్ బెంగళూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి కోర్టు హాల్‌లోకి ప్రవేశించాడు. దర్శన్, పవిత్ర గౌడలకు మరణశిక్ష విధించాలని కోరుతూ బెంగళూరు నగర కోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశాడు. వారిద్దరికి బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ.. మరణశిక్ష విధించడమే సరైన న్యాయం అంటూ న్యాయమూర్తిని అభ్యర్థించాడు. అప్పుడు న్యాయమూర్తి "నువ్వు ఎవరు?" అని అడిగారు. ఆ వ్యక్తి "నేను రవి బెలగెరె వైపు నుండి వచ్చాను" అని బదులిచ్చాడు. మీ దరఖాస్తు లేదా అభ్యర్థన ఏదైనా ఉంటే అది ప్రభుత్వం నుంచి రావాలని న్యాయమూర్తి సూచించారు. విచారణ సమయంలో ఇలా ప్రవేశించడం నేరం అంటూ అతన్ని మందలించారు. ఆ తర్వాత అనామిక కోర్టు నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నారు.

దర్శన్‌ను బళ్లారి జైలుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణను కోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఇలా గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి అలజడి సృష్టించడంతో దర్శన్‌ అభిమానులు ఆందోళన చెందారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)