Breaking News

రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌

Published on Tue, 06/03/2025 - 12:34

అంజు అరవింద్‌ (Anju Aravind).. నటి మాత్రమే కాదు డ్యాన్సర్‌ కూడా! అప్పట్లో మలయాళ సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె కన్నడ, తమిళ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. తెలుగులో రథయాత్ర అనే ఏకైక సినిమాలో నటించింది. అరుణాచలం సినిమాలో రజనీకాంత్‌ సోదరిగానూ కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి వెల్లడించింది.

రెండు పెళ్లిళ్లు విషాదాంతం..
అంజు అరవింద్‌ మాట్లాడుతూ.. మొదటి పెళ్లి విడాకులతో ముగిసిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాక భర్త మరణించాడు. ఇప్పుడు నేను నా చిన్ననాటి క్రష్‌తో కలిసి జీవిస్తున్నాను. సంజయ్‌ అంబలపరంబత్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నాను. నన్ను డ్యాన్స్‌ టీచర్‌గా నిలబెట్టి, బెంగళూరులో సెటిలవడానికి సాయం చేసింది సంజయే.. చిన్నప్పుడు ఒక డ్యాన్స్‌ స్కూల్‌లో కలుసుకున్నాం. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పుడతడే నా ఫస్ట్‌ క్రష్‌. 

మా ప్రేమకథతో సినిమా తీయొచ్చు
డ్యాన్స్‌ స్కూల్‌ అయిపోయాక మా జీవితాలు వేరయ్యాయి. చివరకు ఇలా విచిత్రంగా కలుసుకుని ఒక్కటయ్యాం.. మా కథ చెప్పాలంటే ఓ సినిమానే తీయొచ్చు అని చెప్పుకొచ్చింది. డ్యాన్సర్‌ అయిన సంజయ్‌ మొదట్లో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ప్రేయసి కోసం బెంగళూరులో అంజు అరవింద్‌ అకాడమీ ఆఫ్‌ డ్యాన్స్‌ సంస్థను నెలకొల్పాడు. మలయాళంలో బోలెడన్ని సినిమాలు చేసిన అంజు అరవింద్‌.. తర్వాతి కాలంలో బుల్లితెరపైనా సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. 

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. ట్రీట్‌మెంట్‌ పనిచేయక నటుడు మృతి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)