Breaking News

తమిళ్‌లో పెద్ద హిట్‌.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి

Published on Wed, 01/29/2025 - 13:33

విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్‌. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్‌ సర్క్యూట్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్‌ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ను అదే టైటిల్‌తో సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా నా ఫస్ట్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్‌ హీరోయిన్‌గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'

నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)