కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
అత్తామామలతో అనిరుధ్.. ప్రముఖులకు పెళ్లికి ఆహ్వానం!
Published on Sat, 10/17/2026 - 14:24
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులను స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్, ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్లను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.
ఈమేరకు దిగిన ఫొటోలను సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్, కావేరి మారన్తో పాటు అనిరుధ్ కూడా పాల్గొన్నాడు.
నవంబర్ 11న
అనిరుధ్, కావ్య మారన్ల వివాహం గ్రీస్లో జరగనుందని, నవంబర్ 11న పెళ్లి ముహూర్తం ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. వివాహ తేదీ, వేదిక వివరాలు కూడా ఇంకా ఖరారైనట్లు అధికారికంగా వెల్లడించలేదు.
(ఇదీ చదవండి: అనిరుధ్తో కావ్యా మారన్ పెళ్లి: ఏజ్ గ్యాప్, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?)
அழைப்பு முதலமைச்சர் சி. ஜோசப் விஜயை சந்தித்து, காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழா அழைப்பிதழை வழங்கினார் சன் டிவி குழுமத் தலைவர் கலாநிதி மாறன். காவேரி கலாநிதி, அனிருத் ரவிச்சந்தர் உடன் இருந்தனர். #SunNews | #KaviyaMaran | #Anirudh | #Vijay
— Sun News (@sunnewstamil) October 17, 2026
அழைப்பு பிரதமர் நரேந்திர மோடியை சந்தித்து, காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு அழைப்பிதழை வழங்கினார் சன் டிவி குழுமத் தலைவர் கலாநிதி மாறன். காவேரி கலாநிதி, அனிருத் ரவிச்சந்தரின் பெற்றோர் லட்சுமி, ரவிச்சந்தர் உடன் இருந்தனர். #SunNews | #KaviyaMaran | #Anirudh | #PMModi
— Sun News (@sunnewstamil) October 17, 2026
Tags : 1