'దేవర'ను చూసిన అనిరుధ్‌.. ఆ రెండు సినిమాలతో పోలిక

Published on Thu, 09/26/2024 - 13:02

ఎన్టీఆర్‌- కోరటాల శివ కాంబినేషన్‌లో తెరెక్కిన సినిమా దేవర. కొన్ని గంటల్లో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. నేడు అర్థరాత్రి నుంచే  ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఎక్కడ చూసిన దేవర బజ్‌ క్రియేట్‌ అయింది. అయితే, తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

'దేవర సినిమాకు సంగీతం అందిస్తున్న క్రమంలో ఆ సీన్లు చూసి నేను ఆశ్చర్యపోయాను. దీంతో ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందించాలని ఈ సినిమాకు సంబంధించిన రీరికార్డింగ్‌ వర్క్‌లో 90 శాతం పైగానే విదేశాల్లో పూర్తి చేశాను. దేవర చూస్తున్నంత సేపు హాలీవుడ్‌ సినిమాలైన 'అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌' చిత్రాలను చూసిన ఫీల్‌ కలగుతుంది. ఇదొక భారీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కింది. ఇందులోని సంగీతం అందరినీ మెప్పిస్తుంది. ఇంత గొప్ప సినిమాను ఎలా నిర్మించారని నాకు అనిపించింది. అదే అనుభూతిని సెప్టెంబర్‌ 27న ప్రేక్షకులు కూడా పొందుతారు. అందుకే నేను కూడా తారక్‌ అభిమానులతో కలిసి దేవర ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూస్తాను.  కొరటాల శివ హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా సంతోషమే. వాళ్లందరితో కలిసి  ఎంజాయ్‌ చేస్తా.' అని అనిరుధ్‌ పంచుకున్నారు.

జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)