Breaking News

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌.. అతిథుల లిస్ట్‌లో ఏకైక టాలీవుడ్ హీరో

Published on Tue, 10/27/2026 - 17:01

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్‌ కావ్య మారన్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వచ్చేనెల 10, 11 తేదీల్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ జంట గ్రీస్‌లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారని సమాచారం. ఈ వేడుకలో ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు పాల్గొనే ‍అవకాశముంది.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రిసెప్షన్‌కు సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. అద్భుతమైన డిజైన్‌తో బ్లూకలర్‌ కోటింగ్‌ రూపొందించారు. వీరి రిసెప్షన్‌ వేడుకను చెన్నైలోని ఐటీసీలో నిర్వహించనున్నారు. ఈ ‍గ్రాండ్ రిసెప్షన్‌ నవంబర్‌ 21న జరగనుంది. ఈ వేడుకకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఈ గ్రాండ్‌ రిసెప్షన్‌కు కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అనిరుధ్ మామ అయిన నటుడు రజనీకాంత్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి, అజిత్ కుమార్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఆహ్వానితులలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ మాత్రమే అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)