Breaking News

యానిమల్‌ అప్డేట్.. లిప్ లాక్ పోస్టర్ వైరల్

Published on Tue, 10/10/2023 - 13:17

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌, నేషనల్ క్రష్  రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'యానిమల్‌' .ఇప్పటికే కబీర్‌ సింగ్‌ను బాలీవుడ్‌కు హిట్‌ ఇచ్చిన తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘యానిమల్‌’ విడుదలకు రెడీగా ఉంది. ఇందులో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రి టీజర్‌ని మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేయగా అందుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజగా ఈ చిత్రం గురించి మరోక క్రేజీ సమాచారాన్ని షేర్‌ చేశారు.

(ఇదీ చదవండి: షాండ్‌విచ్‌ దెబ్బకు ఆస్పత్రిపాలైన టాప్‌ హీరోయిన్‌)

కొద్ది సేపటి క్రితం ఓ రొమాంటిక్ పోస్టర్‌ను వదులుతూ యానిమల్‌ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల గురించి వివరాలు ప్రకటించారు మేకర్స్‌. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో మొదటి సాంగ్‌ను అక్టోబర్‌ 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో ‘అమ్మాయి’ అనే టైటిల్‌తో ఈ పాటు విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.  దీనిని సందీప్‌ వంగాతో పాటు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

రణ్‌బీర్‌కపూర్‌- రష్మిక  ఆకాశంలో లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను విడుదల చేశారు. సందీప​ రెడ్డి మొదటి చిత్రం అయిన అర్జున్‌ రెడ్డి పోస్టర్‌తో ఫ్యాన్స్‌ పోలుస్తున్నారు. అందులో విజయ్‌ దేవరకొండ- షాలినీ కూడా లిప్‌లాక్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇప్పుడు యానిమల్‌ పోస్టర్‌తో మూవీతో పాటు సాంగ్‌పై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు.  2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా యానిమల్‌ విడుదల అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)