Breaking News

పదేళ్లుగా నన్ను అలా ట్రోల్‌ చేస్తునే ఉన్నారు: అనిల్‌ రావిపూడి

Published on Wed, 01/22/2025 - 15:19

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ శాతం చాలా తక్కువ. వరుస హిట్లను అందించిన దర్శకులు చాలా అరుదు. టాలీవుడ్‌లో అయితే రాజమౌళి తర్వాత కెరీర్‌లో ఒక్క ప్లాఫ్‌ లేని దర్శకుడు అనిల్‌ రావిపూడి(Anil Ravipudi ) మాత్రమే. ఆయన దర్శకుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ పదేళ్లలో ఏనిమిది సినిమాలు తెరకెక్కిస్తే ప్రతిదీ సూపర్‌ హిట్‌ టాక్‌నే సంపాదించుకుంది. 

ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. వారం రోజుల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఎఫ్‌ 2 మొదలుకొని చివరి 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయినా కూడా అనిల్‌ రావిపూడిపై కొంతమంది నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ ‘జబర్థస్త్’ ​కామెడీ షోని గుర్తు చేస్తుందని కొంతమంది విమర్శిస్తుంటారు. తాజాగా ఈ విమర్శలపై అనిల్‌ రావిపూడి స్పందించాడు. గత పదేళ్లుగా తన సినిమాలను ‘జబర్థస్త్‌ కామెడీ’ షోతో పోలుస్తూనే ఉన్నారని.. సినిమా ప్రేక్షకులే వారికి సమాధానం చెబుతున్నారని కాస్త వ్యంగ్యంగా చెప్పారు.

‘నా  సినిమాల్లో  జబర్దస్త్ టైపు స్కిట్స్‌ ఉంటాయని కొంతమంది అంటుంటారు. అలా అనేవాళ్లు పది శాతం ఉంటే.. 90 శాతం మంది నా సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. గత పదేళ్లుగా కొంతమంది నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది. అందుకే నేను వాళ్లను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. ఆడియన్సే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు అన్నదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో 200 కోట్లను రాబట్టదు. ఎవరో ఏదో అంటున్నారని నేను నా పంథాను మార్చుకోను. ఇలానే సినిమాలు చేస్తాను. నాకు ఆడియన్స్‌ తోడుగా ఉన్నారు. నా సినిమాలను ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలను చేస్తున్నాను. కామెడీ కోసం కూడా బూతు పదాలను వాడట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చేత కూడా కొంతవరకు మాత్ర బూతులు తిట్టించాను. అది కూడా ఓ మంచి సందేశం ఇవ్వడం కోసమే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం. దాని కోసమే చిన్న చిన్న బూతు పదాలు వాడం.అంతకు మి​ంచి నా సినిమాల్లో బోల్డ్‌ కంటెంట్‌ అనేది ఉండదు. ఇకపై కూడా కామెడీ సినిమాలను చేస్తాను.ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది’ అని అనిల్‌ రావిపూడి అన్నారు.

కాగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేశ్‌, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్లోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లో 218 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సంపాదించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)