Breaking News

‘చిత్రపురి కాలనీ’ 40 నెలల్లో పూర్తి చేస్తాం: వల్లభనేని అనిల్‌ కుమార్‌

Published on Tue, 05/13/2025 - 12:00

చిత్రపురి కాలనీలో నూతన ప్రాజెక్ట్‌ ‘సఫైర్ సూట్’ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ భూమి పూజ త్వరలో జరుగుతుందని, 40 నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని, రూ.166 కోట్ల అప్పు, బఫర్ జోన్ సమస్యలను అధిగమించి అందరికీ ఇళ్లు అందించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.

‘చిత్రపురి కాలనీ అనేది చక్కటి ఆలోచనతో వచ్చిన ప్రయత్నం. చిత్రపురి కాలనీ కోసం మనం ఎంతగానో కష్టపడ్డాము. ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నవారికి అలాగే కొత్త వారికి కూడా ఇప్పుడు చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు రాబోతున్నాయి అనే వార్త సంతోషకరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉండే ఎన్నో వేల మంది సమస్యలు పరిష్కరింపబడతాయి’అని సీ కల్యాణ్‌ అన్నారు. 

‘చిత్రపురి కాలజీ స్థలం వేలానికి వెళ్ళిన సమయంలో చదలవాడ శ్రీనివాసరావు గారు వచ్చి మనకోసం అండగా నిలబడ్డారు. అలాగే భారత భూషణ్ గారు ప్రభుత్వాలతో ఉన్న సన్నిహిత సంబంధం వల్ల ఈ ప్రాజెక్టు మరింత ముందుకు వెళ్లేందుకు సహాయపడ్డారు. ఈ సమస్యను ఛాంబర్ లోని వారంతా మన సమస్యగా అనుకుని కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. కమిటీ వారందరికీ మరోసారి ధన్యవాదాలు’అని నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ అన్నారు.

బ్రోచర్ విడుదల చేసిన ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్ తదితరులు పాల్గొని, ప్రాజెక్ట్ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సభ్యులకు ప్రాధాన్యత, కొత్త సభ్యులకు ధృవీకరణ పత్రాలతో మెంబర్‌షిప్ ఇవ్వనున్నారు.

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)