Breaking News

స్టార్ కపుల్ గొడవకు పుల్‌స్టాప్.. కోర్ట్ బయటే తేల్చుకున్నారు

Published on Thu, 11/26/2026 - 03:48

హాలీవుడ్ స్టార్స్ ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న ఫ్రాన్స్‌లోని వైన్‌రీ యాజమాన్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. కోర్టు బయటే దీన్ని పరిష్కరించుకున్నట్లు ఇద్దరి నటుల ప్రతినిధులు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం ఆర్థికపరమైన అంశానికే పరిమితం కాలేదు. ఒకప్పుడు హాలీవుడ్‌లో ఫేమస్ జోడీగా గుర్తింపు పొందిన వీరి పెళ్లిబంధం విడిపోవడానికి, బ్రాడ్ పిట్‌పై జోలీ చేసిన వేధింపుల ఆరోపణలు ఈ న్యాయపోరాటంలో హాట్ టాపిక్ అయిపోయాయి.

2022లో జోలీ-పిట్ మధ్య ఈ న్యాయపోరాటం మొదలైంది. ఫ్రాన్స్‌‌లోని ‘షాటో మిరావల్’ అనే వైన్‌రీని వీళ్లిద్దరూ కలిసి కొనుగోలు చేశారు. అయితే తన అనుమతి లేకుండానే వైన్‌రీలో తన వాటాని జోలీ విక్రయించిందని ఆరోపిస్తూ అదే ఏడాది బ్రాడ్ పిట్ ఆమెపై కేసు వేశాడు. దీనికి ప్రతిగా జోలీ కూడా ప్రతిదావా వేసింది. 2016లో ఫ్రాన్స్ నుంచి కాలిఫోర్నియాకు తమ ఆరుగురు పిల్లలతో కలిసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పిట్ తనపై, పిల్లలపై దాడికి పాల్పడ్డారని ఆమె కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆరోపించింది. ఈ ఘటన తర్వాతే తాను విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది.

తన వాటాని బ్రాడ్ పిట్‌కే విక్రయించాలని తొలుత అనుకున్నాను గానీ చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయని జోలీ చెప్పింది. వైన్‌రీలో తన వాటాని విక్రయించడానికి మద్యపానం కూడా ఒక కారణమని జోలీ తన కోర్టు పత్రాల్లో పేర్కొంది. మద్యం తనకు, తన పిల్లలకు బాధాకరమైన, మానసిక వేదన కలిగించే జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే జోలీ తన వాటాని విక్రయించిన స్టోలీ అనే పానీయాల సంస్థతో బ్రాడ్ పిట్‌కు సంబంధించిన మరో న్యాయపోరాటం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)