Breaking News

బోల్డ్ సీన్.. ఆ విషయం డైరెక్టర్‌ ముందే చెప్పారు.. కానీ..: ఆండ్రియా జెరెమా

Published on Wed, 11/26/2025 - 19:58

సింగర్గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెరెమా. విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆమె దాదాపు సుపరిచితమే. ఏడాది మాస్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కవిన్ హీరోగా వచ్చిన యాక్షన్థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్టాక్ను సొంతం చేసుకుంది.

అయితే ఆండ్రియా పిశాచి-2 అనే చిత్రంలోనూ నటిస్తోంది. హారర్ థ్రిల్లర్ మూవీ ప్రకటించి మూడేళ్లయినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్సీన్లో కనిపించే పోస్టర్పై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన ఆండ్రియా.. వివాదస్పద సీన్ గురించి మాట్లాడింది. స్క్రిప్ట్ ప్రారంభంలోనే బోల్డ్ సీన్ చేర్చారని పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. చిత్రంలో ఎవరూ కూడా నగ్నంగా కనిపించరని పేర్కొంది. తనకు డైరెక్టర్ మిస్కిన్పై పూర్తి నమ్మకముందని.. ఆయన కథకు అవసరమైతేనే అలాంటి సీన్స్ పెడతారని వివరించింది. చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కానీ అవన్నీ నగ్నంగా మాత్రం ఉండవని చెప్పింది. ఆయన ఇప్పటికే పలువురు స్టార్ నటులతో సినిమాలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ డైరెక్టర్ సీన్ అవసరమని భావిస్తే అతని దృష్టి కోణం అది కాదని.. సీన్వెనకాల కచ్చితంగా అర్థముంటుందని ఆండ్రియా చెబుతోంది.

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)