Breaking News

చెన్నై 'పుష్ప'గాడి ఈవెంట్‌లో ముగ్గురు స్టార్స్‌.. ఎవరో తెలుసా..?

Published on Sat, 11/23/2024 - 16:40

పుష్పగాడి మాస్‌ జాతర కొనసాగుతుంది. పట్నాలో ఏర్పాటు చేసిన పుష్ప సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌కు సుమారు 2 లక్షల మందికిపైగానే తరలివచ్చారని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను చాలా గ్రాండ్‌గా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. నవంబర్‌ 24న పుష్ప వైల్డ్‌ఫైర్‌ ఈవెంట్‌ పేరుతో చెన్నైలో మరో భారీ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ముగ్గురు సింగర్స్‌ ఉండనున్నారు.

పట్నాలో జరిగిన ట్రైలర్‌ కార్యక్రమంలో భోజ్‌పురి స్టార్‌ సింగర్‌ అక్షర సింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, చెన్నై వేదికగా ఆదివారం సాయింత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముగ్గురు సింగర్స్‌ దుమ్మురేపనున్నారు. వారిలో ఇద్దరూ పుష్ప-1 సినిమాలో తమిళ్‌ వర్షన్‌కు సంబంధించి రెండు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ పాడినవారు కావడం విశేషం. ఆండ్రియా జర్మియా (ఊ సోల్రియా మావా),  రాజలక్ష్మి (సామీ సామీ ) సాంగ్స్‌తో మెప్పించిన వారైతే.. పార్ట్‌2లో 'కిస్సిక్‌' అనే పాటను ఆలపించిన సుబ్లాషిని వేదికపైన సందడి చేయనున్నారు.

ఆండ్రియా నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.. ఈ ఏడాదిలో వెంకటేష్‌ నటించిన సైంధవ్‌ చిత్రంలో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. రాజలక్ష్మి కూడా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఫాలో అయ్యే వాళ్లకు పరిచయమేనని చెప్పవచ్చు.  ‘కిస్సిక్‌’ అనే సాంగ్‌ ఆదివారం రాత్రి 7:02గంటలకు విడుదల కానుంది. ఈ పాటను తెలుగు, తమిళ్‌, కన్నడలో  ఆలపించిన సుబ్లాషిణి  అక్కడ లైవ్‌ ఫర్‌ఫామ్‌ చేయనుంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. డిసెంబరు 5న పుష్పరాజ్‌ మీ ముందుకు రాబోతున్నాడు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)