Breaking News

రాజీవ్ కనకాల- జూనియర్‌కు మధ్య దూరం నిజమేనా?.. అసలు నిజం చెప్పిన రోషన్!

Published on Tue, 12/12/2023 - 18:06

టాలీవుడ్‌ యాంకర్ అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సుమ. ఆమె తర్వాతే ఎవరైనా అన్నవిధంగా సుమ తెలుగు ఇండస్ట్రీలో అంతలా పేరు తెచ్చుకుంది. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజీవ్‌ -యాంకర్‌ సుమ దంపతుల తనయుడు రోషన్‌ కనకాల బబుల్‌ గమ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోషన్.. రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్రెండ్‌షిప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రోషన్ మాట్లాడుతూ.. 'ఫ్రెండ్‌షిప్ ‍అనేది ఒక బంధం. వీరిద్దరి రిలేషన్‌ స్టూడెంట్‌ నెం-1 మూవీ నుంచి ఉంది. నాకు అలాంటి ఫ్రెండ్స్‌ ఉన్నారు. అలాంటి స్నేహితున్ని వదులుకోకూడదు. తారక్‌ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఆయన స్థాయికి చేరుకోవాలనేది నా కోరిక. రాజీవ్‌, జూనియర్‌కు మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై రోషన్ స్పందించారు.  అలాంటిదేం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు వాళ్లు ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఎప్పుడు ఎవరు అలా ఫీలవ్వలేదు. అసలు జరిగితేనే కదా ఫీలయ్యేది.' అని అన్నారు. 

సుమ కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్ట్ చేశారనేది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడలా సపోర్ట్ చేయరు. ఆయనకు టీజర్ నచ్చింది. సాంగ్ కూడా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా పాట పాడావా?అని అడిగారు. నా వాయిస్ చాలా బాగుందన్నారు. దీంతో చిరంజీవి మాటలకు నాకే ఆశ్చర్యమేసింది' అని రోషన్ అన్నారు.  

ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడం కోసం దాదాపు 150 టేక్స్ తీసుకున్నారా? అంటూ రోషన్‌ను యాంకర్‌ ప్రశ్నించారు. దీనికి కాస్తా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రోషన్.. హీరోయిన్‌ మానస చౌదరిని తీసుకొచ్చాడు. ఎన్ని టేకులు తీసుకున్నానో చెప్పు అంటూ ఆమెను అడిగారు. అయితే ఇదంతా ఫన్నీ కోసమే చేసినా సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు రోషన్. కాగా..  ఈ చిత్రం డిసెంబర్‌ 29న థియేటర్లలో సందడి చేయనుంది. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)