Breaking News

వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. ఏమైందంటే?

Published on Wed, 08/07/2024 - 13:51

యాంకర్ సుమ పేరు చెప్పగానే చలాకీ మాటలు, స్పాంటేనియస్ పంచులు గుర్తొస్తాయి. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ఇంటర్వ్యూలు ఇలా ఒకటేమిటి ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఈమె ఆచితూచి మాట్లాడుతూ ఉంటుంది. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఊహించని కాంట్రవర్సీలో చిక్కుకుంది. సుమ చెప్పడం వల్లే తాము లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని కొందరు అంటున్నారు.

ఇంతకీ అసలేమైంది?
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పింది. అపార్ట్‌మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అలా రూ.88 కోట్ల మొత్తంతో సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: నమ్మించి మోసం చేసిన ప్రముఖ సీరియల్ నటి!)

'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్-1 బిల్డింగ్స్ చూశామని, ఫేజ్-2 త్వరలో కడతామని సుమతో ప్రచారం చేయించడం వల్ల ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాం. నేను త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు తీసుకుని ఒక్కో దానికి రూ.25 లక్షలు కట్టాను. ఇప్పుడు మోసపోయామని' ఓ బాధితుడు మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ ప్లేట్ ఫిరాయించడంతో యాంకర్ సుమపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్‌లో సుమతో పాటు ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా నటించారు. ఇప్పుడు కొందరు బాధితులు.. సుమ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)