Breaking News

నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్

Published on Wed, 06/18/2025 - 13:13

సాధారణంగా ఫాదర్స్ డే అనగానే చాలామంది విష్ చేస్తారు. లేదంటే వాట్సాప్‌లో స్టేటస్ పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం నాన్న కలని నిజం చేస్తుంటారు. తెలుగు యాంకర్ లాస్య ఇప్పుడు అలాంటి ఓ పని చేసింది. తండ్రికి కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)

తెలుగులో కొన్నేళ్ల క్రితం యాంకర్‌గా పలు టీవీ షోలు చేసిన లాస్య.. తర్వాత కొన్నాళ్లకు బిగ్‌బాస్ 4వ సీజన్‌లోనూ పాల్గొంది. కాకపోతే విజేతగా నిలవలేకపోయింది. అయితేనేం సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ వీడియోలు చేస్తూ సంపాదిస్తోంది. అలా కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బుతో తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారుని బహుమతిగా ఇచ్చింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 లక్షల వరకు ఉంది.

చిన్నప్పటి నుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది తన ఆశ అని చెప్పిన లాస్య.. పెళ్లి తర్వాత తాను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారని, ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో, వీడియోని యూట్యూబ్‍‌లో పోస్ట్ చేసింది. కడపకు చెందిన లాస్య.. తల్లిదండ్రులు ప్రస్తుతం ఊరిలోనే ఉంటారు. ఈమె మాత్రం భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా)

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)