ఐదేళ్ల కష్టం వృథా అయ్యింది.. ‘కమిట్‌మెంట్‌’ ప్రశ్నపై స్పందించిన అనన్య

Published on Tue, 10/22/2024 - 13:49

‘పొట్టేల్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్‌ మీట్‌లో హీరోయిన్‌ అనన్య నాగళ్లకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్‌ కౌచ్‌ని ప్రస్తావిస్తూ.. ‘అవకాశాల కోసం హీరోయిన్లు  కమిట్‌మెంట్‌ ఇవ్వాలట కదా .. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా?’అని ఓ మహిళా జర్నలిస్ట్‌ అనన్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన అనన్య.. సున్నితంగా సమాధానం ఇచ్చి అక్కడితో ఆ ఇష్యూని ఆపేసింది. అయితే ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. చాలా మంది అనన్యకు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

తాజాగా ఈ వైరల్‌ వీడియోపై అనన్య స్పందించింది. సంస్కారం ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు అడగరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతు..‘ఇంత డైరెక్ట్‌గా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని ఇంటికి వెళ్లాక ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు అడగరు. మీడియా వాళ్లు చాలా మంది నాకు కాల్‌ చేసి ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ..ఒక తెలుగమ్మాయిని అలా అడగడం బాధగా ఉందని చెప్పారు. 

వాళ్లు నా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక తెలుగమ్మాయిని వాళ్లు ఇంతలా సపోర్ట్‌ చేస్తుండడం సంతోషంగా ఉంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. దాని కోసం ఐదేళ్లుగా ఇంట్లో వాళ్లతో ఫైట్‌ చేస్తున్నా. కానీ ఆ ఒక్క ప్రశ్నతో నా ఐదేళ్ల కష్టం వృథా అయిందనిపించింది. 

నేను ఇప్పుడు సక్సెస్‌ అయినా.. కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్‌ అయ్యానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు మళ్లీ బంధువులందరూ ఇదే విషయం మా అమ్మను అడుగుతారు. ఆ జర్నలిస్ట్‌ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఆమెకు సంస్కారం లేదా? ఇలాంటి ప్రశ్న వేసిందనుకున్నా ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా. ఇంకా నయం ఆ ప్రెస్‌ మీట్‌కి మా అమ్మను రమ్మని చెప్పారు. తనే రానని చెప్పింది. వచ్చి ఉంటే చాలా బాధపడేది’అని అనన్య అన్నారు. కాగా అనన్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘పొట్టేల్‌’చిత్రం అక్టోబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)