Breaking News

ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్‌ చేసిన ఆనంద్ మహీంద్రా!

Published on Wed, 06/12/2024 - 16:36

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. కల్కిలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు.

అయితే హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో ఈ సినిమాలోని బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. విభిన్నమైన డిజైన్‌తో రూపొందించిన కారు(బుజ్జి) లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జి అన్ని ప్రధాన నగరాల్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ బుజ్జిని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బుజ్జి మీట్స్‌ ఆనంద్‌ మహీంద్రా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. కల్కి సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు