Breaking News

అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్‌ దేవరకొండ

Published on Wed, 07/12/2023 - 15:01

పదో తరగతి వరకు నా చదువంతా బాయ్స్‌ బోర్డింగ్‌ స్కూల్‌లోనే జరిగింది. అమ్మాయిలతో పరిచయం ఉండేది కాదు. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడాలంటే భయమేసేది. వారితో మాట్లాడేందుకు నాకు రెండేళ్లు పట్టింది. అందరిలాగే నాకు కూడా తొలి ప్రేమ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రేమ అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే బేబీ సినిమాలో చక్కగా చూపించాం.

► ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్ రేంజ్ ఆడియెన్స్‌ను పలకరించే సినిమాతో వస్తున్నాం.. ప్రీమియర్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. నా కెరీర్‌లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది.

► ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్ కంటే.. సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.

► ప్రేమ అనంతమైంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు.

► ప్రేమ దేశం సినిమాకు బేబీ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్‌ వైజ్ చూస్తే మాత్రం ప్రేమిస్తే, 7/జీ బృంధావన కాలనీ స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు.

► అర్జున్ రెడ్డి అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్‌లా మారింది. బేబీ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మేం దాన్ని చూసి బేబీ అని పెట్టలేదు. బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఓ సీన్‌లో వివరిస్తాం. అందరికీ ఈజీగా, క్యాచీగా ఉంటుందని బేబీ అని పెట్టాం.

► కథ చెప్పినప్పుడే కొన్ని సవాళ్లుంటాయని సాయి రాజేష్ అన్న చెప్పారు. నెరేషన్ ఇచ్చి, ట్రాక్స్ పంపించి.. కథ గురించి బాగా ఫీడింగ్ చేశారు. ప్రతీ సీన్‌, ప్రతీ ఎక్స్‌ప్రెషన్స్ గురించి వివరించి చెబుతుంటారు. బాల్ రెడ్డి, విజయ్ బుల్గానిన్ నుంచి కూడా అందుకే బెస్ట్ వర్క్ వచ్చింది.

► స్కూల్ పిల్లాడిలా కనిపించేందుకు కష్టపడలేదు. కానీ డబ్బింగ్ చెప్పే టైంలోనే కష్టపడాల్సి వచ్చింది. పిల్లాడిలా అనిపించేందుకు వాయిస్‌ తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. గొంతులో ఆ అమాయకత్వాన్ని తీసుకురావాల్సి వచ్చింది.

► వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది. తెలుగులో మంచి నటిగా ఎదుగుతుంది. సీన్లు ఎలా చేయాలో మేం ఇద్దరం చర్చించుకునేవాళ్లం. ఆమెతో నటించడాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆమెతో నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంత చిన్న వయసులో, ఇంత మంచి పాత్రను, ఇంత బాగా నటించడం అంటే మామూలు విషయం కాదు.

► ఈ జానర్‌లో సినిమా చేస్తున్నా.. ఆ దర్శకుడితో చేస్తున్నాను.. అని అన్నకి చెబుతాను. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు.

► నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో ప్రీమియర్స్ పెట్టాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ కంటే ముందే ఈ కథను విన్నాను.

► బేబీ సినిమాకు యూత్ అంతా కూడా కనెక్ట్ అవుతారు. మాస్ జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర కోసం ఆటో నడపడం నేర్చుకున్నాను.

► కొత్త సినిమా విషయాలకొస్తే..  గం గం గణేశా అనే సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. క్రైమ్ జానర్‌లో ఉంటుంది. అందులో ఫైట్లు చేశాను. స్టెప్పులు కూడా వేశాను. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)