Breaking News

'డైరెక్టర్స్ రొమాంటిక్‌ హీరోయిన్‌గానే చూస్తారు.. కానీ అలా తొలిసారి'

Published on Fri, 01/12/2024 - 12:25

డైరెక్టర్స్ రొమాంటిక్‌ హీరోయిన్‌గానే చూస్తారుహాలీవుడ్‌ బ్యూటీ అమీ జాక్సన్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లండన్‌కు చెందిన బోల్డ్‌ అండ్‌ బ్యూటీ మోడలింగ్‌ రంగంలో రాణిస్తూ దర్శకుడు ఎంఎల్‌ విజయ్‌ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మదరాసు పట్టణం చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆ తరువాత రజినీకాంత్‌, విజయ్‌, విక్రమ్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించి భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో లండన్‌కు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ వెబ్‌సీరీస్‌లో నటించారు.

అలాంటి పరిస్థితుల్లో తనను కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ మళ్లీ అమీజాక్సన్‌ను కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం మిషన్‌ చాప్టర్‌–1. అరుణ్‌విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా పొడక్షన్‌ సంస్థ నిర్మించింది. పొంగల్ సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అమీజాక్సన్‌ లండన్‌కు చెందిన పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటించడం విశేషం.

అయితే అనారోగ్యంతో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు విజయ్‌ తన చిత్రాల్లో పాత్రలను శక్తివంతంగా రూపొందిస్తారన్నారు. ఎంతగా అంటే.. ఎన్నేళ్లయినా కూడా ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయన్నారు. అలాంటి దర్శకుడి ద్వారా మదరాసు పట్టణం చిత్రంతో తాను హీరోయిన్‌గా పరిచయం అవడం తన అదృష్టమని అన్నారు. మిషన్‌ చాప్టర్‌ –1 చిత్రంలో తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. చాలా మంది దర్శకులు తనను రొమాంటిక్‌ హీరోయిన్‌గానే చూస్తారని.. అందువల్ల తనకు యాక్షన్‌ కథాపాత్రలు వస్తాయని ఊహించలేదన్నారు. అలాంటిది దర్శకుడు తనకు యాక్షన్‌ హీరోయిన్‌గా చూపించారని చెప్పారు. ఈ చిత్రం తన సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం తనకు ఉందని అమిజాక్సన్‌ పేర్కొన్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)