Breaking News

ఈ రోజుకు 84 ఏళ్లు.. రూ.90కోట్ల అప్పు.. రూ.4000 కోట్ల సామ్రాజ్యం!

Published on Sun, 10/11/2026 - 14:20

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.. ఈ పేరు భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఎన్నో దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆయన ప్రయాణంలో విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. ఒకప్పుడు ఆర్థిక కష్టాలతో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆయన.. నేడు వేల కోట్ల ఆస్తి ఉన్న కుటుంబానికి ప్రతినిధిగా నిలిచారు. అక్టోబర్‌ 11, 2026 నాటికి 84వ పడిలోకి అడుగుపెడుతున్న అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సంపాదన, ఆస్తులు, ఆర్థిక సంక్షోభం నుంచి తిరిగి పుంజుకున్న తీరు గురించి తెలుసుకుందాం.

రూ.4 వేల కోట్ల ఆస్తి..
సినిమాల్లో స్టార్‌డమ్‌ సంపాదించడం ఒక ఎత్తయితే.. ఆ విజయాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అమితాబ్‌ బచ్చన్‌ కెరీర్‌ ఈ విషయానికి ఉదాహరణగా నిలుస్తుంది. అక్టోబర్‌ 2026లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 వివరాల ప్రకారం.. బచ్చన్‌ కుటుంబ సంపద సుమారు రూ.4,000 కోట్లుగా పేర్కొనబడింది. అయితే ఇది అమితాబ్‌ వ్యక్తిగత ఆస్తి మాత్రమే కాదు.. ఆయన కుటుంబానికి చెందిన మొత్తం సంపద.

రూ.90 కోట్ల అప్పులు..
ఈ రోజు వేల కోట్ల సంపద గురించి మాట్లాడుకుంటున్న అమితాబ్‌ జీవితంలో ఒకప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1990ల చివర్లో ఆయన స్థాపించిన ఏబీసీఎల్‌ (అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కంపెనీ వ్యాపార ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. సుమారు రూ.90 కోట్ల అప్పుల భారం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది.

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో కొత్త జీవితం!
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అమితాబ్‌ మళ్లీ తన బలమైన ఆయుధమైన నటనను నమ్ముకున్నారు. యశ్‌ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘మొహబ్బతేన్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడం ద్వారా అమితాబ్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినిమాలతో పాటు టెలివిజన్‌ ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు పెరిగాయి.

84 ఏ‍ళ్ల వయసులోనూ అదే జోరు!|
వయసు పెరుగుతున్నా అమితాబ్‌ బచ్చన్‌ సినీ ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంది. సినిమాలు, టెలివిజన్‌ కార్యక్రమాలు, ప్రకటనలతో ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నారు. ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన.. విజయాన్ని మాత్రమే కాదు, అపజయం ఎదురైనప్పుడు మళ్లీ ఎలా నిలబడాలో కూడా తన జీవిత ప్రయాణంతో చూపించారు.

(ఇదీ చదవండి: ‘రిపోర్టింగ్‌ లైవ్‌’ రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?)
 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)