Breaking News

భార్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో.. అదేంటో తెలుసా?

Published on Thu, 11/14/2024 - 07:13

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్  వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్  వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్‌ నటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

అయితే శివ కార్తికేయన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్మీ డ్రెస్‌లోనే తన ఇంటికెళ్లి భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంటిపనితో ఫుల్ బిజీగా ఉన్న ఆయన భార్య ఆర్తి దగ్గరికి వెళ్లి సైలెంట్‌గా నిల్చున్నారు. ఇదేమీ గమనించని ఆర్తి తనపని చేసుకుంటూ అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అమరన్ గురించి..

కాగా.. అమరన్ చిత్రాన్ని 2014లో జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా తెరకెక్కించారు. ఈ దాడుల్లో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ 2009లో ఇందును వివాహం చేసుకోగా..2011లో వీరికి కుమార్తె అర్షే ముకుంద్ జన్మించింది. ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్‌ పుస్తకం ఆధారంగా రూపొందించారు. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)